Andhra Pradesh : మామిడి రైతులకు నేడు ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు మామిడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది.

Update: 2025-10-11 03:47 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు మామిడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. చిత్తూరు మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. గతంలో చెప్పిన విధంగానే తోతాపురి మామిడి రైతులకు నేడు 183 కోట్ల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం జమ చేయనుంది. చిత్తూరు తోతాపురి మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధర లభించలేదని ఆందోళన చేసిన నేపథ్యంలో నాడు ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సబ్సిడీ నిధులను విడుదల....
ప్రభుత్వం తోతాపురి మామిడి రైతులకు ఇచ్చిన హామీ మేరకు వారికి ప్రభుత్వం సబ్సిడీ అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో నేడు దానికి సంబంధించిన నిధులను విడుదల చేయనుంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు చెందిన మామిడి రైతులు ఈ సబ్సిడీని పొందనున్నారు. సుమారు డెబ్భయి వేల మంది రైతులు లబ్ది పొందనున్నారు.


Similar News