ఏనుగుల బావిలో చిరుతపులి
రాయదుర్గం ఏనుగుల బావిలో చిరుతపులి శవమై కనిపించింది.
రాయదుర్గం ఏనుగుల బావిలో చిరుతపులి శవమై కనిపించింది. స్థానికులు చిరుత పులి చనిపోయి ఉండటాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు బావిలో ఉన్న చిరుత పులిని బయటకు తీశారు. అయితే ఈ చిరుతపులిని ఎవరైనా చంపేసి బావిలోకి పడేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనేక అనుమానాలు...
చిరుతపులి గత కొంతకాలం నుంచి ఇక్కడే సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఎవరైనా చంపేసి చిరుతపులిని బావిలో పడేశారా? లేక చిరుత ప్రమాదవశాత్తూ బావిలో పడిందా? అన్న కోణంలో అటవీ శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. చిరుతపులి మృతదేహానికి పోస్టు మార్టం జరిపి నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం వెల్లడవుతుందని అంటున్నారు.