ప్రకాశం జిల్లాలో చిరుత పులి మృతి.. అందుకేనా?

ప్రకాశం జిల్లాలో చిరుతపులి మరణించింది. యర్రగొండపాలెంలోని కొలుకుల అటవీ ప్రాంతంలో చిరుత పులిమరణించిందింది.

Update: 2025-02-16 12:56 GMT

ప్రకాశం జిల్లాలో చిరుతపులి మరణించింది. యర్రగొండపాలెంలోని కొలుకుల అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత పులిమరణించిందింది. ఈ అటవీ ప్రాంతంలో కుందేళ్లను పట్టుకోవడానికి వేటగాళ్లు ఉచ్చులను ఏర్పాటు చేశారు.అయితే కుందేళ్ల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుతపులి పడి మరణించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

వేటగాళ్ల ఉచ్చులో...
అయితే దీనిపై అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద వశాత్తూ చనిపోయిందా? లేక ఉచ్చులో వేసి వేటగాళ్లు చంపేశారా? అన్నది అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వేటకు వెళ్లే వారిని గుర్తించి వారిని అటవీశాఖ అధికారులు విచారణ చేయడం ప్రారంభించారు. చిరుత పులి మరణించడంపై అటవీ శాఖ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.


Tags:    

Similar News