Andhra Pradesh : ఏపీలో భూముల రీ సర్వే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో భూముల రీ సర్వే మళ్లీ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ లో భూముల రీ సర్వే మళ్లీ మొదలైంది. ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన ఒక గ్రామంలో ఈ నెల పదో తేదీ నుంచి ప్రభుత్వ భూముల్ని కొలుస్తున్నారు. 20వ తేదీ నుంచి ప్రైవేట్, వ్యవసాయ భూములకు కొలతలు వేస్తారు. తర్వాత మిగిలిన గ్రామాల్లోనూ రీ సర్వే చేపడతారు.ఈ మొత్తం ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో...
భూమి సర్వే చేయడం గత ప్రభుత్వంలో ఏమైనా భూ లావాదేవీల్లో జరిగిన అవకతవకలు గుర్తించడానికేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అనేక రకాలైన భూకుంభకోణాలు వెలుగుచూశాయి. ఇతరుల నుంచి భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. టీడీపీ పార్టీ కార్యాలయంలోనూ భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు మాత్రమే ఎక్కువ వస్తుండటంతో భూముల సర్వే మొదలయిందని తెలిసింది.