YSRCP : కొడాలి నానికి ఆ భయం లేదట.. అందుకు రీజన్ ఇదే

మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో యాక్టివ్ కాలేదు

Update: 2026-02-19 08:58 GMT

మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో యాక్టివ్ కాలేదు. ఆయన గత రెండేళ్ల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. కొడాలి నాని అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లడం మినహా గుడివాడలో మాత్రం ఉండి రాజకీయాలు మొదలు పెట్టలేదు. దీంతో కార్యకర్తలు ఆయన గుడివాడకు ఎప్పుడు వస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. మరొకవైపు గుండెకు ఆపరేషన్ జరగడంతో ఆయన రాజకీయ సమావేశాలకు కూడా గైర్హాజరవుతున్నారు. అయితే వైసీపీకి గుడివాడలో కొడాలి నానికి మించి మరొక నేత ప్రత్యామ్నాయంగా ఎవరూ లేరు. అందుకే ఆయన వచ్చినప్పుడే గుడివాడలో వైసీపీ యాక్టివ్ అవుతుందని నాయకత్వం నమ్ముతుంది.

నాలుగు సార్లు గెలిచి...
కొడాలి నాని గుడి వాడ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు సార్లు టీడీపీ, రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా కూడా అయ్యారు. 2024లో ఓటమి పాలయ్యారు. అయితే చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం పెద్దయెత్తున జరిగింది. రెడ్ బుక్ లో మొదట కొడాలి నాని పేరుందన్న క్యాంపెయిన్ కూడా నడిచింది. కానీ కొడాలి నాని అనారోగ్యంతో ఉండటంతో ఆయనపై అనేక కేసులున్నా ఇప్పటి వరకూ ఆయనను పట్టించుకోలేదంటున్నారు. మరొకవైపు గుడివాడలో 2024 ఎన్నికల్లో గెలిచిన వెనిగండ్ల రాము నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడంతో కొంత పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
మరో ఏడాదిన్నర తర్వాతే...
అందుకే గుడివాడలో వైసీపీకి మళ్లీ హైప్ పెరుగుతుందన్న నమ్మకంతో పార్టీ నాయకత్వం కూడా ఉంది. జగన్ పాదయాత్ర మొదలయిన తర్వాత కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొనే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ముఖ్య అనుచరులు కలిసేందుకు హైదరాబాద్ కు వెళ్లి ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. అందుకే వైసీపీ నాయకత్వం కూడా ప్రత్యామ్నాయం వైపు చూడలేదంటున్నారు. కొడాలి నాని ఎవరు కాదనుకున్నా సామాజికవర్గం పరంగానే కాకుండా గుడివాడలో వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్న బలమైన నేత కావడంతో ఆయన వచ్చినప్పుడే రాజకీయాలలు మొదలవుతాయి లేనన్న భావనలో నాయకత్వం ఉంది. అందుకే కొడాలి నానికి టిక్కెట్ వస్తుందా? రాదా? అన్న భయం లేదు.




Tags:    

Similar News