TDP : నేడు టీడీపీ కీలక సమావేశం

నేడు తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ సమావేశం జరగనుంది

Update: 2025-08-23 03:13 GMT

నేడు తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మావేశానికి మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు నేతలతో చర్చించే అవకాశముంది.

చంద్రబాబు నివాసంలో...
అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికలతో పాటు రాష్ట్ర కమిటీ నియామకానికి సంబంధించిన అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు నేతలతో చర్చించనున్నారని తెలిసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఫీడ్ బ్యాక్ ను తీసుకుని ముందుకు వెళ్లాలని, అలాగే ఈ సందర్భంగా మంత్రులకు , ఎమ్మెల్యేలకు సంబంధించిన కొన్నిఅంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News