Andhra Pradesh Liqour Scam : లిక్కర్ స్కామ్ లో పొంగుతున్న కరెన్సీ కట్టలు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ప్రతిరోజూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

Update: 2025-07-30 06:41 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ప్రతిరోజూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు దాదాపు అరవై కోట్ల రూపాయలను సీజ్ చేశారు. మొత్తం మద్యం స్కామ్ విలువ 3,800 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో దొరికిన నోట్ల కట్టలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తవ్వేకొద్దీ అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ కేసులో పన్నెండు మంది నిందితులను అరెస్ట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని భావించి కూటమి ప్రభుత్వం రాగానే స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. గత ఏడాది నుంచి ఈ స్కామ్ కు సంబంధించిన విచారణ జరుగుతుంది.

పన్నెండు మందిని...
ఈ కేసులో కీలకనిందితుడైన రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ తర్వాత అనేక మంది అరెస్టయ్యారు. నిందితులందరూ దుబాయ్ లోని ఒక గెస్ట్ హౌస్ లో తలదాచుకున్నారని సిట్ విచారణలో వెల్లడయింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డితో పాటు అనేక మందిని అరెస్ట్ చేశారు. వీరందరినీ పలు దఫాలుగా సిట్ అధికారులు విచారించారు. విచారణలో పేర్కొన్న అంశాల మేరకు సిట్ అధికారులు తాజాగా హైదరాబాద్ లో అనేక చోట్ల సోదాలు నిర్వహించారు. భారతి సిమెంట్స్ లో కూడా తనిఖీలు నిర్వహించారు. గోవిందప్ప నిందితుడిగా ఉండటంతో భారతి సిమెంట్స్ లో సోదాలు జరిగాయి.
తాజాగా 11 కోట్లను...
తాజాగా శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్‌హౌస్‌లో డబ్బును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఫామ్ హౌస్ పై దాడి చేసి పన్నెండు పెట్టెల్లో దాచిన పదకొండు రూపాయలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో డబ్బు దాచినట్టు అంగీకరించిన వరుణ్, చాణక్యలు అంగీకరించారు. 2024 జూన్‌లో డబ్బు దాచినట్టు గుర్తించిన సిట్ అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ సొమ్మును సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ బాల్‌రెడ్డి పేర్లపై ఫామ్‌హౌస్‌ ఉన్నట్టు గుర్తించారు. వారిని కూడా ప్రశ్నించే అవకాశముంది.
Tags:    

Similar News