మ్యాజిక్ జీప్ ను తయారు చేసిన కాకినాడ యువకుడు
మహా నగరాల్లో ట్రాఫిక్ సమస్యను చూస్తే చాలు ఎందుకు ఇక్కడ ఉంటున్నామా అని అనిపిస్తూ ఉంటుంది.
మహా నగరాల్లో ట్రాఫిక్ సమస్యను చూస్తే చాలు ఎందుకు ఇక్కడ ఉంటున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. ట్రాఫిక్ లో కారులో ఇరుక్కుపోయినప్పుడు మన పక్కనే ఉన్న బైకర్ ఎంచక్కా వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి సమయంలో అబ్బా బైక్ మీద వచ్చి ఉన్నా తొందరగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళమని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచన నుండి పుట్టుకొచ్చిందే మ్యాజిక్ జీప్.
కాకినాడకు చెందిన సుధీర్ వినూత్నంగా ఆలోచించి ‘మ్యాజిక్ జీప్’ తయారు చేశాడు. హైడ్రాలిక్ సాయంతో వాహనం సైజ్ మార్చుకోవచ్చు. ముగ్గురు ప్రయాణికులు ఉన్నప్పుడు ఒకలా, ఇద్దరు ఉన్నప్పుడు మరోలా జీప్ సైజ్ తగ్గించడం, పెంచడం చేయవచ్చు. ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. సుధీర్ ఆలోచనను ఎంతో మంది ప్రశంసిస్తూ ఉన్నారు.