నాలుగు రోజులు పవన్ ఇక్కడే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 11న మంగళగిరి రానున్నారు
peddapuram ambati oils
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 11న మంగళగిరి రానున్నారు. 12వ తేదీన కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్యతో పాటు అన్ని నియోజకవర్గాల కాపు సంక్షేమ సేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. దీంతో పాటు ఈ నెల 12, 13 తేదీల్లో జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు.
14 మధ్యాహ్నం మచిలీపట్నానికి...
ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం వారాహి వాహనంలో మచిలీపట్నానికి పవన్ బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు నాలుగు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఏపీలోనే ఉంటారని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. జనసేన ఆవిర్భావ సభ మచిలీపట్నంలో జరుగుతుందని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.