Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఇక గుడ్ బై చెప్పనున్నారా? ఫుల్లు టైం కేటాయించనున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్ చై చెప్పే ఆలోచనలో ఉన్నారు

Update: 2025-07-22 07:58 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్ చై చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఆయన ఇక రాజకీయాల్లో పూర్తి కాలం కొనసాగేందుకే నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకే నిన్న హరిహరవీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో గాని, మీడియా సమావేశంలో కాని ఇకపై తాను సినిమాలు చేయకపోవచ్చని చెప్పారు. పవన్ ఫ్యాన్స్ కు నిజంగా నిరాశ పర్చే వార్తే. ఎందుకంటే అతి తక్కువ సినిమాలు చేసి ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న పవన్ కల్యాణ్ కు నిజజీవితంలో సినిమాలపై ఆసక్తి లేదు. ఆయన ఎక్కువ కాలం ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకుని జనసేన పార్టీ 2014లో ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో దారుణ ఓటమికి గురి కావడంతో ఆయన మనసును మళ్లించుకోవడానికి కొంత కాలం సినిమాల వైపు మళ్లించారు.

2019 ఎన్నికల ఫలితాల వెంటనే...
2019 ఎన్నికలు జరిగిన తర్వాత వెనువెంటనే రాజకీయాల్లో తన పరిస్థితి ఏంటో పవన్ కల్యాణ్ తాను తెలుసుకున్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ కమల్ హాసన్ వంటి స్టార్లు రాజకీయాల్లో రాణించలేకపోవడం, రాజకీయాల్లోకి వచ్చేందుకు అన్నీ సిద్ధం చేసుకుని వెనక్కు తగ్గిన రజనీకాంత్ ను చూసిన తర్వాత పవన్ కల్యాణ్ ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెబుతున్నారు. తాను కీలక పదవిలో లేకపోయినా ఏపీ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించాలన్న భావనతో ఆయన 2019 ఎన్నికల తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జత కట్టారు. అయితే ఏపీలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేకపోవడంతో ఆయన టీడీపీతో సన్నిహితంగా మెలగాలని కోరుకున్నారు.
జగన్ ను మళ్లీ ఓడించాలంటే...
జగన్ ను ఓడించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నా పార్టీ మద్దతు అవసరం. ఓటు బ్యాంకు లేకపోయినా ఎలక్షనీరింగ్ చేయాలంటే బీజేపీ సహకారం అవసరమవుతుందని గ్రహించారు. ఇక టీడీపీ విషయానికి వస్తే క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీ, ఓటు బ్యాంకు భారీగా కలిగిన పార్టీగా, యాభై వసంతాల చరిత్ర కలిగిన పార్టీగా దానిని కూడా కూటమిలో కలుపుకుంటే జగన్ ను కొట్టేయవచ్చన్న నమ్మకంతోనే కూటమిని ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. ఇక రానున్న కాలంలోనూ కూటమికి తిరుగులేదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా కాకపోయినా సరే.. చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలకంగా మారాలన్నది మాత్రం పవన్ ఆలోచనగా ఉంది. అందుకే పవన్ కల్యాణ్ కూటమిని సజావుగా వచ్చే ఎన్నికల వరకూ మనస్పర్థలు తలెత్తకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సినిమాలకు స్వస్తి చెప్పి ఫుల్ టైం రాజకీయాల్లోనే ఉంటారట.



Tags:    

Similar News