లాస్ట్ మినిట్ లో నేమ్ ఛేంజ్... అత్యంత దురదృష్టవంతుడు ఈయనే
చివరి నిమిషంలో జగన్ మార్పులు చేశారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ను తిరిగి కేబినెట్ లోకి తీసుకున్నారు
కేబినెట్ విస్తరణలో చివరి నిమిషంలో జగన్ మార్పులు చేశారు. 25 మందితో కొత్త కేబినెట్ జాబితా రూపొందించారు. అయితే ప్రకాశం జిల్లాకు ఒక్కమంత్రి పదవి ఇవ్వకుండా కేబినెట్ కూర్పు చేశారు. అయితే చివరి నిమిషంలో జగన్ మార్పులు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ను తిరిగి కేబినెట్ లోకి తీసుకున్నారని తెలిసింది. ఆయనను కేబినెట్ లోకి తీసుకోవడంతో పేరు ఖరారయిన తిప్పేస్వామి పేరు లాస్ట్ మినిట్ లో తొలగించారు.
బాలినేని అసంతృప్తిపై.....
దీనికి ప్రధాన కారణం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడమే. ప్రకాశం జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుపు బాట పట్టించగలమని, మీరే వచ్చి పార్టీని నడుపుకోవాలని బాలినేని కొంత కటువుగానే సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పినట్లు తెలిసింది. దీంతోనే అనంతపురం జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం నుంచి పేరు ఖరారయిన తిప్పేస్వామిని తొలగించి ఆయన స్థానంలో ఆదిమూలపు సురేష్ పేరు ను చేర్చారని తెలిసింది.