Anhdra Pradesh : ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవల బంద్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ కొనసాగుతుంది. బకాయిలు చెల్లించే వరకు బంద్ ఉంటుందని నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయ్యాయి. దీంతో రోగులు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు.
వెయ్యి కోట్లు విడుదల చేస్తామని...
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటన చేసింది. వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పింది. హామీపై స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. తమకు బకాయీ ఉన్న మొత్తం మూడు వేల కోట్ల రూపాయలను చెల్లించాలని డిమాండ్చేస్తుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.