Andhra Pradesh : ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. వచ్చే ఏడాది ఖరీఫ్ కు పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
అడ్వాన్స్ కింద నిధులను...
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్ గా నిధులను పోలవరం ప్రాజెక్టు కోసం విడుదల చేసింది. 1,301 కోట్ల రూపాయల అడ్వాన్స్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టుకు 1,508 కోట్లు విడుదల చేసింది. పోలవరానికి మొత్తం రూ.2,809 కోట్లు కేంద్రం విడుదల చేసినట్లయింది.