Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏడు వేల కోట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది

Update: 2026-04-02 06:11 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బకాయీలు చెల్లించాలని నిర్ణయించారు.

పెండింగ్ లో ఉన్న...
పెండింగ్ బిల్లుల్లో 7,059 కోట్ల రూపాయల విడుదలకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరిపేలా మంత్రి పయ్యావుల కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పూర్తి బకాయీలు చెల్లించాలని నిర్ణయించడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


Tags:    

Similar News