Andhra Pradesh : నేటితో సర్పంచ్ ల పదవీ కాలం ముగింపు
ఆంధ్రప్రదేశ్ లో సర్పంచ్ ల పదవీ కాలం ముగియనుంది
ఆంధ్రప్రదేశ్ లో సర్పంచ్ ల పదవీ కాలం ముగియనుంది. దీంతో పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల పాలనలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఏప్రిల్ 2తో ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం పూర్తి కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం G.O.Ms.No.47 విడుదల చేసింది.
రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పాలన...
ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం కానుంది. తహశీల్దార్, ఎంపీడీవో,ఎంఈవోలకు బాధ్యతలు అప్పగించనున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు వీరిదే అధికారం ఉండనుంది. కలెక్టర్లకు నియామక బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.