Chandrababu : ఈరోజు సాయంత్రం దీపాలు వెలిగించండి

ఎన్డీఏ నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు

Update: 2026-04-02 05:31 GMT

ఎన్డీఏ నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు సాయంత్రం అమరావతికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించాలని కోరారు. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన వెంటనే ప్రతి ఒక్కరూ కేంద్రానికి మద్దతు తెలపాలని తెలిపారు.

అమరావతికి మద్దతుగా...
ఈరోజు మధ్యాహ్నం రాజధానికి శంకుస్థాపన జరిగిన ఉద్దండ రాయినిపాలెం వెళ్తున్నానని చెప్పారు. కే్ంద్ర ప్రభుత్వానికి మద్దతుగా సంఘీభావం తెలపాలని కోరారు. ప్రజలు చీదరించుకున్నా జగన్ లో మార్పు రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిని రాజధానిగా ఇక ఎవరూ మార్చలేదని చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News