Ys Jagan : జగన్ ను టచ్ చేయడం వేస్ట్... కూటమి సర్కార్ లో క్లారిటీ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో కూటమి సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది

Update: 2026-02-20 07:03 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో కూటమి సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని? ఆయనపై కేసులు ఎప్పుడు నమోదవుతాయని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందంటున్నారు. జగన్ పై కేసులు రాష్ట్రంలో నమోదయ్యే అవకాశాలు లేవు. అలాగే జగన్ ను అరెస్ట్ కూడా చేయడం జరగదు. ఇది ఎవరో చెప్పింది కాదు. టీడీపీ అగ్ర నేతల నుంచి వచ్చిన సమాచారం అంటున్నారు. జగన్ ను అరెస్ట్ చేసి, కేసులు నమోదు చేసి సానుభూతి ఆయనపై కురిపించడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. వచ్చే ఎన్నికల్లో కూటమి తిరిగి అధికారంలోకి రావాలంటే జగన్ జోలికి వెళ్లకపోవడమే మంచిదన్నభావన పార్టీ అగ్రనాయకత్వంలో వ్యక్తమవుతుంది.

రెండేళ్లవుతున్నా...
అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకూ జగన్ పై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మద్యం కేసులో కానీ, మరొక కేసులో కానీ వైసీపీ నేతలను, జగన్ కు అత్యంత సన్నిహితులను అరెస్ట్ చేశారు. ఒకరు కాదు... ఇద్దరు కాదు చాలా మంది జగన్ ముఖమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో పనిచేసిన వారిని సయితం అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేశారు. అయితే జగన్ మీద మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంపై టీడీపీ సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున విమర్శలు చేస్తున్నారు. జగన్ విషయంలో ఇంత నాన్చుడు ధోరణి ఎందుకని? రెడ్ బుక్ లో జగన్ పేరు లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
కూటమి విజయావకాశాలపై...
కానీ చంద్రబాబు, లోకేశ్ మాత్రం జగన్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని ఫిక్సయిపోయారు. జగన్ ను టచ్ చేస్తే సానుభూతి వస్తుందని, కూటమి ప్రభుత్వ విజయావకాశాలపై దెబ్బపడుతుందని ఢిల్లీ పెద్దలు కూడా సలహా ఇచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థల చేత అరెస్ట్ చేయించాలని కొన్నాళ్లు చేసిన ప్రయత్నాలకు కూడా బీజేపీ అగ్ర నేతలు అంగీకరించలేదని తెలిసింది. చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ ఎంత భారీ మూల్యం చెల్లించుకున్నాడో వారు గుర్తు చేసి వద్దని చెప్పి పంపుతున్నారట. అందుకే జగన్ విషయంలో కూటమి ప్రభుత్వం ఈ టర్మ్ లో వెళ్లే అవకాశం లేదన్నది సుస్పష్టం. జగన్ కు అనవరంగా సానుభూతి తెచ్చి పెట్టే ఆలోచనలకు కూటమి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది.


Tags:    

Similar News