Andhra Pradesh : ఏపీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులంటే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మార్చి 21 వ తేదీ వరకూ జరపాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 21 వ తేదీ వరకూ జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాలు మొత్తం పదిహేను రోజులు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో డిసైడ్ చేశారు. వారంలో ఐదు రోజుల పాటు సభను నిర్వహించాలని కూడా నిర్ణయించారు.
పది హేను రోజులు...
ఈ నెల 28న బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. పది హేను పనిదినాల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. అవసరమైతే మరో రెండు రోజుల పాటు పొడిగించేందుకు కూడా బీఏసీ సమావేశంలో అన్ని పార్టీలూ అంగీకరించాయి. అయితే బీఏసీ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.