తిరుమలలో రెండు రోజుల పాటు రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న తిరుమలకు రానున్నారు.

Update: 2025-11-06 13:32 GMT

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న తిరుమలకు రానున్నారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది తిరుమలకు చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు తిరుమలలో రాష్ట్రపతి ఉండనున్నారు. ఈ నెల 20వ తేదీన రాష్ట్రపతి తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి పట్టణ సమీపంలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దర్శింకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

వెంకన్న దర్శనానికి...
అనంతరం ఆమె అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరి వెళతారు. నవంబరు 21వ తేదీన తొలుత వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం తర్వాత వెంకన్న దర్శనానికి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సమీక్షించారు. భద్రతతో పాటు రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు.


Tags:    

Similar News