నేడు తిరుపతికి రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుపతికి చేరుకోనున్నారు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుపతికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.25 గంటలకు ద్రౌపది ముర్ము రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.55 గంటలకు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. ప్రత్యేక పూజలను రాష్ట్రపతి ఆలయంలో నిర్వహించనున్నారు.
సాయంత్రం తిరుమలకు...
అనంతరం సాయంత్రం ఐదు గంటలకు తిరుమలకు బయలుదేరి వెళతారు. రాత్రికి తిరుమలలోనే ష్ట్రపతి ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. రేపు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం బయలుదేరి రాష్ట్రపతి వెళారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా తిరుపతి, తిరుమలలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.