YSRCP : పులివెందులలో జగన్ కు షాకిచ్చిన నేతలు
వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో వైసీపీ నేతలు షాక్ ఇచ్చారు
వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో వైసీపీ నేతలు షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ నేతలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే ఏపీలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీపై దృష్టి సారించింది.
మున్సిపాలిటీ పరిధిలో...
జగన్ సొంత నియోజకవర్గంలో ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బలమైన వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి లోకల్ క్యాడర్ సిద్ధమయింది. స్థానికంగా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్ కు తెలియజేస్తోంది. తాజాగా పులివెందుల మున్సిపాలిటీలోని 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదా టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వైసీపీ మద్దతుదారులైన 20 కుటుంబాలు ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. త్వరలోనే మరింత మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది.