Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో బీజేపీ తిరంగా ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా యాత్రలు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా యాత్రలు చేయనుంది. ఈ నెల 14వ తేదీ వరకూ ఈ తిరంగా యాత్రలు కొనసాగనున్నాయి. ఈ తిరంగ యాత్రల్లో భాగంగా స్థానికంగా ఉన్న ఎక్కడికక్కడ స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేయడం, వారి కుటుంబాల వద్దకు వెళ్లి స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించడం వంటివి చేయాలని నిర్ణయించింది.
పదిహేనో తేదీ వరకూ...
దీంతో పాటు భారతదేశం కోసం వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను పరామర్శించడంతో పాటు వారికి నివాళులర్పించాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఈ నెల 14వ తేదీన జిల్లా స్థాయిలో దేశ విభజన సమయంలో ఏర్పడిన పరిస్థితుల్లో ఒక ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయాలని కోరింది. ఆగస్టు 13వ తేదీ నుంచి పదిహేనో తేదీ వరకూ బీజేపీ శ్రేణుల ఇళ్లపై భారతీయ జెండాలను కుటుంబ సభ్యులతో కలసి ఆవిష్కరించాలని, బహిరంగ ప్రదేశాల్లోనూ భారత పతాకాన్ని స్థానిక ప్రజలతో కలసి ఎగురవేయాలని కోరింది.