తూర్పు గోదావరి జిల్లాలో పరువు హత్య
తూర్పు గోదావరి జిల్లాలో పరువు హత్య జరిగింది
తూర్పు గోదావరి జిల్లాలో పరువు హత్య జరిగింది. తన సోదరిని పెళ్లి చేసుకున్నారని అన్నదమ్ములు కలసి హత్య చేసిన ఘటన సంచలనం కలిగించింది. మండపేట మండలం వేములపల్లిలో ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. తమ చెల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో సూర్యప్రకాష్ అనే యువకుడిని యువతి సోదరులు రాళ్లతో కొట్టి చంపారు.
ప్రేమ వివాహం చేసుకోవడంతో...
నిన్న అన్నవరంలో సంధ్య, సూర్యప్రకాష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రాయవరం డిప్యూటీ తహసీల్దార్‌గా సంధ్య పనిచేస్తుండగా, సూర్య ప్రకాష్ ఒక వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారని తెలిసింది. సూర్యప్రకాష్ వేములపల్లికి వెళ్తుండగా పట్టుకుని రాళ్లతో యువతి సోదరులుదాడి చేయగా గాయపడి సూర్య ప్రకాష్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు సహకరించిన మరో వ్యక్తితో పాటు ముగ్గురు నిందితులు అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.