జస్ట్ అలా పడిపోతే ఎముకలు విరుగుతాయా?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పై ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు

Update: 2026-02-27 04:21 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పై ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. ఇటీవల రఘురామ కృష్ణరాజు క్రికెట్ ఆడుతూ పడి పోవడంతో ఆయన భుజానికి గాయమయింది. ఎముకలు విరిగినట్లు తేలింది. దీనిపై పీవీ సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. కస్టోడియల్ టార్చర్ కేసులో రఘురామ కృష్ణరాజు కు తగిన గాయాల గురించి ఆయన స్పందించారు. 

రఘురామ కృష్ణరాజు గాయంపై...
పీవీ సునీల్ కుమార్ ఎక్స్ లో ఏమన్నారంటే... "జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడి లో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అది కూడా ఆయన వర్ణించిన అంత దారుణంగా కొడితే ? అబద్ధాలు బయట పడుతున్నాయి… నిజం దాగదు" అంటూ ఆయన ట్వీట్ చేశారు. పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ ను ప్రభుత్వం ఇటీవల పొడిగించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News