ఔటర్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోయే రైతులు సమావేశమయ్యారు. పలు డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. కు బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నష్టం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు వెడల్పు ను తగ్గించాలని ఓఆర్ఆర్ రైతులు కోరుతుున్నార. వీరులపాడు మండలం జుజ్జూరు లో ఓఆర్ఆర్ కింద భూములు కోల్పోతున్న రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఔటర్ రింగ్ రోడ్ మొదట 140 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించారని తెలియజేశా.రు కానీ ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 05-01-2026 తేదీ ప్రకారం, వెడల్పు 250 మీటర్లకు పెంచబడిందిని , బఫర్ జోన్ పరిధిలో 500 మీటర్లు ఉంటుందని ప్రచారంలో ఉందన్నారు. దీని ఫలితంగా ప్రైవేట్ భూమి లో ఎక్కువ విస్తీర్ణణ సేకరింరిస్తున్నారని తెలిపారు. 250 మీటర్ల వెడల్పుతో సేకరణ అనేది మితిమీరిన ఏకపక్షం నిర్ణయం మరియు ప్రభుత్వం మొట్టమొదటి చెప్పిన దానికి వాస్తవ అవసరానికి చాలా మించిపోయి భూమి సేకరణ చేస్తున్నారని రైతులు అన్నారు.
సాథ్యాసాధ్యాలను పరిశీలించి...
అటువంటి వెడల్పు పెంపుదల అవసరం ,సాంకేత,సాధ్యాసాధ్య అధ్యయనం పరిశీలించి 70 మీటర్ల కు కుదించాలని,సెక్షన్ 26(1) భూసేకరణ ప్రతిపాదించిన సంవత్సరం నుండి మూడు సంవత్సరాల పాటు సమాన పరిసర ప్రాంతాల్లో 3 సంవత్సరాల అమ్మకాలు కొనుగోలు ఏది ఎక్కువ ధరకు అమ్ముడుపోయి ఉంటే దాని ఆధారంగా 4 రెట్లు అధికంగా ఇవ్వాలని చట్టం చెబుతుందన్నారు. .బహిరంగ మార్కెట్లో మా భూముల యొక్క విలువ అధికంగా ఉన్నది దీన్ని పరిగణలకు తీసుకోవాలని కోరుతున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ణయించిన మార్కెట్ రేటు చాలా తక్కువగా ఉందని, భూమి యొక్క నిజమైన బహిరంగ మార్కెట్ విలువ అధికంగా ఉంటుందని, దీనిని పరిగణనలోకి తీసుకోవాలని, రిజిస్ట్రార్ విలువ మరియు భూమి యొక్క మార్కెట్ విలువ మధ్య చాలా వ్యత్యాసం ఉందని రైతులు తెలిపారు. కనుక బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రైతులతో చర్చలు జరపాలని ,రైతులు అంగీకారం తీసుకోవాలని రైతులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం యన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్,చాట్ల రవి,రైతులు గంగిరెడ్డి రంగారావు నన్నపనేని భాస్కరరావు మల్లెల సుబ్బారావు పాప శ్రీనివాసరావు సాయిరాం, పూర్ణ, జ్ఞాన రెడ్డి,శ్రీనివాసరెడ్డి భోజడ్ల.శ్రీనివాసరావు, గోపి,వెంకటేశ్వరరావు వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు