Chandrbabu : చంద్రబాబు బలం అదే.. ప్రతి ఎన్నికలో గెలుపుపై అదే నమ్మకం
చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి యాభై ఐళ్లు కావస్తుంది.
చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి యాభై ఐళ్లు కావస్తుంది. యాభై ఏళ్లు రాజకీయాల్లో ఉండటమే ఒక రికార్డు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ఎలా సాధ్యమయిందంటే.. ఆయన పరిపాలనపై తనకంటూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోగలిగారు. 1995లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అందుకున్నప్పటీకి ప్రజల మన్ననలను పొంది ఎప్పటికప్పుడు తన ఎన్నికల వ్యూహాలను మారుస్తూ వెళుతూ అధికారంలోకి పార్టీని తెస్తున్నారు. ఎందరో నేతలు పార్టీని వీడి వెళ్లారు. సీనియర్ నేతలు వెళ్లినా... చంద్రబాబు పని అయిపోయిందని అందరూ అనుకున్నప్పటికీ మళ్లీ తిరిగి టీడీపీని అధికారంలోకి తేవడం అంటే మాటలు కాదు.
జగన్ పై గెలుపు...
జగన్ విషయంలో చంద్రబాబు కు ఫుల్ క్లారిటీ ఉంది. జగన్ పై గెలవడం అంత సులువు కాదని తెలుసు. జగన్ కు కొంత సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది. అయితే దానిని తన వైపునకు తిప్పుకోవడం అంత సులువైన పని కాదు. అందుకే ఎప్పటికప్పుడు వ్యూహలు మారుస్తున్నారు. ప్రజల నాడిని అంచనా వేస్తూ పొత్తులను పెట్టుకుని, అవసరమైతే టీడీపీ కొన్ని సీట్లను త్యాగాలు చేసైనా సరే గెలిచి ముఖ్యమంత్రి అవుతూ వస్తున్నారు. 2024 లో కూడా బీజేపీ, జనసేనను కలుపుకుని వెళ్లడంతోనే గెలుపు సాధ్యమయింది. చంద్రబాబు ఇక నిరంతరం ప్రజల్లో ఉండటం కూడా ఆయనకు కలసి వచ్చే అంశం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన నిరంతరం జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అందుకే ఆయనపై విశ్వాసం జనంలో ఎక్కువగా కనిపిస్తుంది.
2029 ఎన్నికల్లో గెలిచి తీరాలని...
ఇక 2029 ఎన్నికల్లో గెలిచి తీరాలన్నది చంద్రబాబు ఆలోచన. కూటమితోనే వెళ్లి జగన్ పార్టీని అధికారంలోకి రానివ్వ కుండా ఇప్పటి నుంచే ఆయన కసరత్తు మొదలు పెట్టారు. నియోజకవర్గాలను పర్యటిస్తూ అక్కడి సమస్యలను ప్రస్తావిస్తూ తనకు గుజరాత్ మోడల్ అధికారం ఇవ్వాలని పదే పదే కోరుతున్నారు. మధ్యలో బ్రేక్ వస్తే అభివృద్ధిపనులు ఆగిపోతాయని జనానికి నూరిపోయడంలో కొంత సక్సెస్ అవుతున్నారు. తిరిగి జగన్ వస్తే ప్రాజెక్టులు పూర్తి కావని, అభివృద్ధి పనులు నిలిచిపోతాయని జనంలోకి బలంగా సందేశాన్ని పంపగలుగుతున్నారు. అందుకే ఈసారి ఎన్నికలు ఏపీలో రసవత్తరంగా జరుగుతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గెలుపు కోసం చంద్రబాబు ఇప్పటి నుంచే పద్దెనిమిది గంటలు నిరంతరం పనిచేస్తుండం కూడా కలసి వస్తుందన్న విశ్లేషనలు వినిపిస్తున్నాయి.