హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ గా జస్టిస్ లీసా గిల్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ గా జస్టిస్ లీసా గిల్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ మరో రెండు నెలల్లో రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా పంజాబ్ హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. B.A. LL.B, LL.M పూర్తి చేసిన ఈమె 1990లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
కొలీజియం సిఫార్సు మేరకు...
2014లో పంజాబ్ హరియాణా జడ్జిగా నియమితులయ్యారు. కొలీజియం సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగాపంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నియమితుతయ్యే అవకాశముంది . ప్రస్తుత చీఫ్ జస్టిస్ మార్చి 5, 2026న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఈ నియామకం జరగనుంది. ఆమె ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చి, అనంతరం చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు