బెజవాడను ముంచెత్తిన వర్షం... ఇంద్రకీలాద్రిపై పనులకు ఆటంకం
విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి
heavy rains in vijayawada
విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కేవలం భారీ వర్షమే కాదు ఉరుములు మెరుపులతో విజయవాడ వాసులను హడలెత్తించింది. అయితే ఎండ, ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అయిన విజయవాడ నగర ప్రజలకు ఇప్పుడు కురిసిన భారీ వర్షం కొంత ఊరట కలిగించింది.
రేపటి నుంచి...
అయితే రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే దుర్గ గుడిపై పనులకు ఆటంకం ఏర్పడింది. దసరా ఉత్సవాలకు ప్రభుత్వం ముమ్మరంగా పనులు చేపట్టింది. కానీ పనులు పూర్తవుతున్న దశలో భారీ వర్షం కురుస్తుండటంతో పనులు నిలిచిపోయాయి. భారీ వర్షంతో ప్రధాన రహదారులన్నీ జలమయి పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.