vijayawada : ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుంది. పెరుగుతున్న వరదతో విజయవాడ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుంది. పెరుగుతున్న వరదతో విజయవాడ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6.81 లక్షల క్యూసెక్కులుగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి వరద నీరు విడుదల చేస్తున్న అధికారులు మరింతగా వరద ప్రవాహం పెరుగుతుందని చెబుతున్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను...
విజయవాడ బెర్న్‌పార్క్ వద్ద టూరిజం సిబ్బంది అప్రమత్తమయ్యారు. పర్యాటకశాఖ బోట్లను తాళ్లతో కట్టేసిన డ్రైవర్లు అవి వరదల్లో కొట్టుకుపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. నదీపరివాహక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశఆరు. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీచేసిన జలవనరుల శాఖ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో లోతట్టు గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.