Srisailam : శ్రీశైలం జలాశయానికి వరద నీరు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతుంది.

Update: 2025-06-30 03:12 GMT

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయంలో వరద నీరు పెరుగుతుంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి వరద నీరు పోటెత్తుతుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,56,554 క్యూసెక్కులు ఉండగా నీటిని బయటకు అధికారులు వదలడం లేదు.

విద్యుత్తు ఉత్పత్తి...
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 872.50 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తి స్దాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలుకాగా ప్రస్తుతం 152.4941 టీఎంసీలు ఉందని అధికారులు వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టులోని కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News