డయేరియా పై అవగాహన కల్పిస్తున్నాం : మంత్రి సత్యకుమార్
డయేరియా పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు
డయేరియా పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేయిస్తున్నామని చెప్పారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని, ప్రాధమికంగా నీటిలో ఎటువంటి కలుషిత పదార్థాలు లేవని తేలిందని చెప్పారు.
మొత్తం 141 కేసులు...
ఇప్పటికి విజయవాడ రాజరాజేశ్వరి పేటలో 141 కేసులు నమోదు అయ్యాయని, 61 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.నీరు, పానిపూరి, వంకాయెండి చేపలు తినడం వలన వచ్చాయని స్థానికులు చెబుతున్నారన్నారు. మొదటి విడత టెస్ట్ లో ఎలాంటిది లేదని తెలిసిందని,మంచినీటి సరఫరా లో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.