Kasibugga Stampade : ఇంత మంది వస్తారని ఊహించలేదు : హరిముకుంద్ పండా
శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట పై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు
శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట పై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. ఆయన తాను పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. తనకు ఈరోజు ఇంత మంది భక్తులు ఈరోజు వస్తారని అంచనా వేయలేదని హరిముకుంద్ పండా చెప్పారు. రోజుకు రెండు నుంచి మూడు వేల మంది వరకూ మాత్రమే ఆలయానికి స్తారని, వచ్చిన భక్తులు ప్రశాంతంగా స్వామి వారిని దర్శనం చేసుకుని వెళతారని అన్నారు. ఏరోజు కూడా ఐదు వేల మందికి మించి ఆలయానికి రాలేదన్నారు.
పోలీసులకు సమాచారం ఇవ్వలేదు...
వచ్చిన భక్తులకు దర్శనం తర్వాత ప్రసాదం వితర చేసి పంపిస్తానని, ఈరోజు ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆయన తెలిపారు. ఎందుకు ఇంత మంది ఒక్కసారిగా వచ్చారో తనకు తెలియదని హరిముకుంద్ పండా చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిస్తే పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చేవారమని అన్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు, వచ్చేందుకు రెండు మార్గాలున్నాయని, అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని హరిముకుంద్ పండా అభిప్రాయపడ్డారు.