మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఈ మేరకు మధ్యాహ్నం అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఈ మేరకు మధ్యాహ్నం అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. నిన్న రాత్రి రాజభవన్ కు 24 మంది మంత్రుల రాజీనామాలు చేరుకున్నాయి. వీటిని గవర్నర్ ఆమోదించారు.
కొత్త మంత్రుల....
అయితే ఈరోజు సాయంత్రానికి కొత్త మంత్రుల జాబితా గవర్నర్ కు చేరుకుంటుంది. ఈ జాబితాను కూడా గవర్నర్ ఆమోదించిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుంది. రేపు ఏపీ కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ హాలుకు పక్కనే ఉన్న గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొత్త మంత్రుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక పాస్ లను జారీ చేయనున్నారు.