Andhra Pradesh : అభివృవృద్ధి వైపు ఏపీ దూసుకు పోతుంది
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. పరిమితమైన వనరులున్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అయితే 2019 లో మాత్రం రాష్ట్ర పురోగతికి విఘాతం కలిగిందని, తిరిగి రాష్ట్రాన్ని పునర్మించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లో తమ ప్రభుత్వం పనిచేస్తుందని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి దిశగా దూసుకెళుతుందని తెలిపారు. అలాగే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో తీసుకెళుతున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. గత పంధొమ్మిది నెలలుగా తమ ప్రభుత్వం రాష్ట్ర పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి వైపు వెళుతుందని తెలిపారు.
ధ్వంసమయిన వ్యవస్థలను...
ధ్వంసమయిన అన్ని వ్యవస్థలు తిరిగి గాడిలో పడుతున్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. అభివృద్ధి లో కూడా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని, ఏపీలో పెట్టుబడులు కోసం పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని అన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో పడకుండా అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకు వచ్చామని తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లభించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ర సంపదను సృష్టించే ప్రగతి చక్రాన్ని నిర్మించడం కోసం సర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశామని చెప్పారు.