Talliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం నిధులు వారి ఖాతాల్లో యాభై రెండు వేలు
తల్లికి వందనం పథకం కింద నిధులను ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు పడుతుంది.
తల్లికి వందనం పథకం కింద నిధులను ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు పడుతుంది. మొత్తం 67 లక్షల మంది అర్హులైన వారికి తల్లికి వందనం పథకం కింద ఈ ఏడాది పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. అందులో రెండు వేల రూపాయలు పాఠశాల నిర్వహణ కింద తీసుకుని పదమూడు వేల రూపాయలను తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలను జమ చేస్తుంది. ఇప్పటికే అనేక మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ అయింది. నలుగురు పిల్లలున్న తల్లులు ఇరవై వేల మంది వరకూ ఉన్నారు. వీరికి ఒక్కొక్కరి 52 వేల రూపాయలు నగదు వారి ఖాతాల్లో తల్లికి వందనం పథకం కింద అమలు చేయనుంది.
ఎంత మంది పిల్లలున్నా...
అలాగే ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నప్పటికీ వారందరికీ నగదు జమ చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అయితే "తల్లికి వందనం" పథకం 2025 లబ్ధిదారుల జాబితాలో లేరని తెలిస్తే అనర్హతలు కొన్ని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి మార్గదర్శకాలను మాత్రమే తల్లికి వందనం పథకం కింద అమలు చేశామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అయితే అర్హత ఉన్నప్పటికీ నగదు జమ కాని వారు ఈనెల 26వ తేదీన మన మిత్ర వాట్సప్ నెంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే అర్హతలన్నీ ఉన్న వారిని మాత్రమే పరిశీలించి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అర్హులైన వారు ఎంత మంది ఉన్నా అందరికీ నగదు జమ చేస్తామని చెప్పారు.
అనర్హతకు కారణాలివే
మీరు ఎందుకు జాబితాలో లేరో తెలుసుకోవడానికి మీ గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. వారు మీకు కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది
కుటుంబ వార్షిక ఆదాయం నిర్దేశిత పరిమితిని మించడం
విద్యార్థికి 75% హాజరు లేకపోవడం.
తల్లి పేరుపై బ్యాంకు ఖాతా లేకపోవడం లేదా NPCI లింక్ కాకపోవడం.
హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో తల్లి లేదా పిల్లల వివరాలు నమోదు కాకపోవడం.
కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి, ప్రజా ప్రతినిధి, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉండటం.
మూడు ఎకరాలకు మించి మాగాణి భూమి లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండటం.
కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం (ట్రాక్టర్లు, ఆటోలు మినహా) ఉండటం.
నెలవారీ కరెంట్ వినియోగం 300 యూనిట్లు దాటడం.
1000 చదరపు అడుగులకు మించి నివాసం కలిగి ఉండటం.
ఫిర్యాదు ఇలా చేయండి....
అర్హత ఉండి కూడా జాబితాలో మీ పేరు లేకపోతే, మీరు అభ్యంతరం లేదా ఫిర్యాదు చేయవవచ్చు
గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించడానికి అవకాశం కల్పిస్తారు.
ప్రభుత్వం జూన్ 20, 2025 వరకు ఫిర్యాదులను స్వీకరించి, జూన్ 30, 2025 న తుది జాబితాను విడుదల చేస్తుంది
మీరు మీ దరఖాస్తును మళ్లీ సమర్పించవలసి రావచ్చు, లేదా మీ అర్హతను రుజువు చేసే అదనపు పత్రాలను సమర్పించవలసి రావచ్చు.
అవసరమైన పత్రాలివే
మీరు దరఖాస్తు చేసినప్పుడు సమర్పించిన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తనిఖీ చేసుకోండి.
తల్లి మరియు పిల్లల ఆధార్ కార్డులు.
తల్లి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా, అది ఆధార్ మరియు NPCI తో లింక్ అయి ఉండాలి
కుటుంబ ఆదాయ ధృవపత్రం.
విద్యార్థి యొక్క హాజరు శాతం వివరాలు.
రేషన్ కార్డు.
బర్త్ సర్టిఫికెట్ (పిల్లలది).
హౌస్‌హోల్డ్ డేటాబేస్ & eKYC:
తల్లులు మరియు వారి పిల్లల వివరాలు హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో నమోదు అయి ఉండాలి.
తల్లి యొక్క eKYC తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. ఇది పూర్తి చేయకపోతే పథకం లబ్ధి చేకూరదు. ఇది మీ దగ్గరలోని గ్రామ/వార్డు సచివాలయంలో లేదా మీసేవ కేంద్రంలో చేసుకోవచ్చు.