దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిపై విచారణ

దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిపై విచారణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది

Update: 2025-09-05 05:53 GMT

దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిపై విచారణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఆమె పై అనేక అభియోగాలు రావడంతో ఇప్పటికే శాంతిపై సస్పెన్షన్ వేటు వేశారు. శాంతిపై వచ్చిన ఆరోపణలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వివరణ కోరారు. అయితే శాంతి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

వచ్చిన ఆరోపణలపై...
శాంతి గత వైసీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖలో కీలకంగా వ్యవహరించి అనేక అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న ఆరోపణలపై కూడా విచారణ కొనసాగనుందని తెలిసింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణ చేయాలని నిర్ణయించింది.


Tags:    

Similar News