Amaravathi : అమరావతి ఆహ్వాన పత్రిక ఇదే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అనంతరం పనుల్లో వేగం పెంచి మూడేళ్లలో పనులు పూర్తి చేసి అమరావతికి ఒక రూపుతేవాలని యోచిస్తుంది. ఈలోపు వివిధ కేంద్రప్రభుత్వ సంస్థలను కూడా అమరావతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆహ్వాన పత్రిక…
మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయల రాజధాని అమరావతి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చాయి. అయితే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రాలను అందచేయనుంది.