దస్తగిరికి భద్రత పెంపు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాల నేపథ్యంలో తనకు భద్రత పెంచాలని దస్తగిరి కోరారు. తనకు ప్రాణ హాని ఉందని, తనకు భద్రతను మరింత పెంచాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
2+2 భద్రత పెంచుతూ...
దీంతో దస్తగిరికి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దస్తగిరికి 1+1 గన్ మెన్ లతో భద్రత కల్పిస్తుండగా ఇప్పుడు 2+2 గన్ మెన్ లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరంతరం దస్తగిరి భద్రతను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.