Andhra Pradesh : నూతన బార్ పాలసీతో యజమానులకు భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్ లో నూతన బార్ పాలసీని ప్రభుత్వం సవరించింది. దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. లైసెన్స్ ఫీజులో భారీ తగ్గింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2025-08-20 01:57 GMT

ఆంధ్రప్రదేశ్ లో నూతన బార్ పాలసీని ప్రభుత్వం సవరించింది. దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. లైసెన్స్ ఫీజులో భారీ తగ్గింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లైసెన్స్ ఫీజు తగ్గించడంతో పాటు బార్ యజమానులు ఆరు సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల ఆర్థికంగా బార్ యజమానులకు లాభం చేకూరడమే కాకుండా, మద్యం తక్కువ ధరకు తగ్గించి విక్రయించేందుకు ఉపయోగపడుతుందని ఎక్సైజ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

బార్ లైసెన్స్ ఫీజును...
గతంలో బార్ లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి వచ్చేంది. కానీ నేడు సులభవాయిదా పద్ధతిలో చెల్లించాల్సి రావడం ఒరకకంగా వారికి సానుకూలమే. బార్ లైసెన్స్ ఫీజు గతంలో 1.97 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం దానిని యాభై ఐదు లక్షల రూపాయలకు తగ్గించింది. అనంతపురం, తిరుపతి, కడపఒంగోలులో యాభై ఐదు లక్షలు రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. యాభై వేల వరకూ జనాభా ఉన్న చోట 35 లక్షలు, యాభై వేలకు మించి ఉన్న జనాభాకు 55 లక్షలు, ఐదు లక్షలకు మించి జనాభా ఉంటే 75 లక్షల రూపాయలుగా బార్ లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. కొత్త బార్ విధానంలో దరఖాస్తు రుసుమును కూడా ఐదు లక్షల రూపాయలు తగ్గించినట్లుఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు.


Tags:    

Similar News