చిత్తూరు మామిడి రైతులకుగుడ్ న్యూస్
చిత్తూరు మామిడి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
చిత్తూరు మామిడి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిత్తూరు జిల్లాలో చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 350 కోట్ల రూపాయలతో ఏబీఐఎస్ ప్రొటీన్స్ ఏర్పాటు చేసే పరిశ్రమకు అనుమతి ఇచ్చింది. చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుతో 790 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో...
2026 అక్టోబర్ 1 నాటికి పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. చిత్తూరు తోతోపూరి మామడికి సరైన గిట్టుబాటు ధర లేక, కొనుగోలు చేసే వారులేక రైతులు రోడ్లమీద పడేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణక్ష్ం తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. 224 కోట్ల రూపాయలతో 750 మందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమ ఏర్పాటుకు అనుమతితో ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు వర్తింపజేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.