తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే ప్ర‌వాసాంధ్రుల‌కు గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే ప్ర‌వాసాంధ్రుల‌కు రోజూ వంద వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు ల‌భించ‌నున్నాయి.

Update: 2025-07-21 12:30 GMT

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే ప్ర‌వాసాంధ్రుల‌కు రోజూ వంద వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు ల‌భించ‌నున్నాయి. వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న కోటాను ప్రవాసాంధ్రులకు 10 నుంచి 100కి పెంచారు. ప్ర‌వాసాంధ్రులు ముందుగా ఏపీఎన్ఆర్‌టీఎస్ వెబ్‌సైట్‌ లోకి వెళ్లి స‌భ్య‌త్వం న‌మోదు చేసుకోవాలి. ఇది పూర్తిగా ఉచితం. తాము ఉంటున్న దేశాల వీసాలు, వ‌ర్క్ ప‌ర్మిట్ల వివ‌రాలు న‌మోదు చేయాలి. వెబ్‌సైట్ లో శ్రీవారి ద‌ర్శ‌నానికి సంబంధించిన మూడు నెల‌ల స్లాట్లు క‌నిపిస్తాయి. అందులో స్లాట్ బుక్ చేసుకోవాలి. టికెట్లు కేటాయింపులు అయిన వారికి ఏపీఎన్ఆర్‌టీఎస్‌కు చెందిన పీఆర్ఓ ద్వారా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

Tags:    

Similar News