నేడు రెండోరోజు ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రెండో రోజు విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రెండో రోజు విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైకోర్టు సూచన మేరకు జిల్లా జైలు అధికారులు ఈ మేరకు వల్లభనేని వంశీని నిన్న రాత్రి ఆయుష్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
అనేక కేసుల్లో...
వల్లభనేని వంశీ వివిధ కేసుల్లో దాదాపు వంద రోజులకు పైగానే విజయవాడ జిల్లా జైలులో ఉంటున్నారు. ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతుండటంతో పాటు దగ్గు, ఆయాసం వంటి వాటితో ఇబ్బంది పడుతుండటంతో తనకు చికిత్స అందించాలని వల్లభనేని వంశీ వేసిన పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు ఆయనకు ప్రయివేటు వైద్య శాలలో పరీక్షలు నిర్వహించి, అవసరమైతే చికిత్స అందించాలని ఆదేశించింది.