Ys jagan : ఎల్లుండి నుంచి జగన్ జిల్లాలకు
ఈ నెల 27వ తేదీ నుంచి వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.
ys jagan
ఈ నెల 27వ తేదీ నుంచి వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఎన్నికల్లో పార్టీని సన్నద్ధం చేసే దిశగా ఆయన పర్యటనలు సాగనున్నాయి. భీమిలీలో తొలి సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. తర్వాత వరస సమావేశాలతో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
26 జిల్లాల్లోనూ...
మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ అధినేత జగన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారయిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఐదు బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన చోట్ల పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికల్లో గెలుపు అవసరంపై దిశానిర్దేశం చేయననున్నారు. ఫిబ్రవరి పదోతేదీలోపు అన్ని జిల్లాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు.