Andhra Pradesh : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నలుగురు పోలీస్ అధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది

Update: 2026-02-22 03:20 GMT

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నలుగురు పోలీస్ అధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసు లో పలువురు పోలీసులు అనంతబాబుకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణ ఉండటంతో వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారుల పై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నలుగురు పోలీసుల అధికారులపై వేటు...
ఘటన జరిగిన సమయంలో కాకినాడ డిఎస్పీ గా పని చేసిన మురళీకృష్ణరెడ్డి, సిఐ ఆకుల మురళీ కృష్ణ, ఎస్ఐ సతీష్ బాబు సస్పెన్షన్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనంతబాబుతో సన్నిహితంగా ఉన్న ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు పైనా సస్పెన్షన్ వేటు పడింది. రెండు రోజుల క్రితం అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ను ఏ2 గా చేరుస్తూ కోర్ట్ లో సిట్ అనుబంధ ఛార్జ్ షీట్ సమర్పించింది.


Tags:    

Similar News