Chandrababu : నేడు గుంటూరు జిల్లాకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు.

Update: 2026-02-22 04:23 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు. సత్యసాయి ఆధ్మాత్మిక నగరంలో గ్రామీణ డాగ్ సేవక్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో పాటు పలువురు ముఖ్యులు హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు.

పోస్టల్ సదస్సులో...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సమన్వయంతో పోస్టల్ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధిాయాలు ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో ఉత్తమ ప్రతిభ కనపర్చిన గ్రామీణ డాడ్ సేవక్ లకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. వివిధ ప్రాంతాల నుంంచి సిబ్బంది ఈ సదస్సుకు తరలి రానున్నారు.


Tags:    

Similar News