హైకోర్టుకు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ వచ్చేంత వరకు సిట్ అధికారులకు దొరకకుండా ఉండేందుకు లక్ష్మీదుర్గ ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్మీదుర్గ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. సీసీ టీవీ కెమెరాలను పరిశీలించిన మీదట లక్ష్మీదుర్గను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అజ్ఞాతంలోనే అనంతబాబు...
ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఘర్షణలో అనంతబాబు తోయడం వలనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయాడని అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గతంలో చెప్పడంతో సిట్ అధికారులు ఆయనను కూడా విచారించాలని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు నవంబర్ 30 వ తేదీ వరకూ గడువు ఇవ్వడంతో విచారణను వేగవంతం చేశారు. అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, డీఎస్పీ మురళీకృష్ణారెడ్డిని సిట్ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది