చెడును ఎదరించడానికి ప్రజలు కూడా ముందుకు రావాలి : చంద్రబాబు

గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

Update: 2026-02-21 12:05 GMT

గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశ్రమల్ని తరిమేశారని, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న నమ్మకాన్ని పోగొట్టారన్నారు. వినుకొండలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలు, భవిష్యత్ ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారన్నారు.కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ పునర్నిర్మాణం మొదలు పెట్టామని, 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని, టీచర్లు, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండేలా వేగంగా పనులు చేశామన్న చంద్రబాబు . కొత్త రోడ్లను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు.వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా కొందరు ప్రవర్తిస్తున్నారని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు తిట్టే పార్టీ రాష్ట్రంలో ఉందన్న చంద్రబాబు ఆంబోతుల తరహాలో తయారై రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి...
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, గంజాయి రవాణా చేశాని, గత పాలకులు శ్రీవారి ప్రసాదాన్ని కూడా నాసిరకంగా తయారు చేయించారన్నారు. ఆ పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవ్వరికీ లేదని, అలాంటి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని చంద్రబాబు అన్నారు. రు సరఫరా చేసిన కల్తీ నెయ్యిని పరీక్ష చేయించామని, జంతువుల కొవ్వు ఉందని ల్యాబ్ నివేదిక వచ్చిందన్న చంద్రబాబు దీనిపై ఏర్పాటైన సిట్ విచారణ చేసి అది అసలు నెయ్యే కాదని చెప్పిందని అన్నారు. వాళ్లు చేసిన తప్పును ఇతరుల పై నెట్టి వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని, వివేకా హత్య ఘటనలో నాటకాల రాయుడు రోజుకు ఓ వేషం వేశారన్న చంద్రబాబు చిన్నాన్న కుమార్తె కూడా మోసపోయేంతగా నాటకాలు వేశారన్నారు. లడ్డూ ప్రసాదం అపవిత్రం చేశారని చెబితే అవినీతి జరిగిందని చెబుతుంటే తిరిగి హెరిటేజ్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నా ఒక్కడిదే కాదు ప్రజలందరిదీ కూడా అని తెలిపారు. చెడును నిరాకరించే పరిస్థితి ప్రజల్లోనూ రావాలని, అప్పుడే రాజకీయ ప్రక్షాళన జరుగుతుందని చంద్రబాబు పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News