Ys Jagan :రాజకీయాలు ఎటు వెళుతున్నాయో

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుసరించిన తీరును వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యంతరం తెలిపారు

Update: 2026-02-21 07:44 GMT

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా సమ్మిట్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుసరించిన తీరును వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యంతరం తెలిపారు. ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినప్పుడు దేశం పరువు తీసేలా వ్యవహరించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలు ఎటు వెళుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. యూత్ కాంగ్రెస్ నేతల వ్యవహారం అందరినీ సిగ్గుపడేలా చేసిందని జగన్ అన్నారు.

విభేదాలున్నా...
రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ భారత దేశాన్ని కించపర్చేలా వ్యవహరించకూడదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఎవరూ మన దేశాన్నికించపర్చకూడదని జగన్ అన్నారు. రాజకీయ పరంగా ఎన్నివిభేదాలున్నప్పటికీ ప్రపంచ దేశాల ముందు మనమంతా ఐక్యంగా ఉండాలని వైఎస్ జగన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.


Tags:    

Similar News