కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు.

Update: 2025-07-08 04:18 GMT

peddareddy 

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనుమతి కోసం ఇప్పటికే ఎస్పీకి లేఖ రాసిన కేతిరెడ్డి తన పర్యటనకు అనుమతించాలని కోరార. యాడికి, పెద్దవడుగూరు మండలాలకు వెళ్లొద్దని ఇప్పటికే కేతిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

తాడిపత్రిలోని తన...
కేతిరెడ్డి పెద్దారెడ్డి గత కొద్ది రోజులుగా తాడిపత్రిలోని తన సొంత ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ తాము భద్రత కల్పించలేమని పోలీసులు చెబుతున్నారు. జేసీ వర్గీయులు దాడి చేస్తారన్న కారణంతో పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News