Rk Roja : ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు
తప్పుడు కేసులు పెడితే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు
తప్పుడు కేసులు పెడితే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కార్లు తీసుకెళ్తే భయపడే వ్యక్తి కాదు జగన్ అని రోజా అన్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆర్కే రోజా మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసులు విడుదల చేసింది ఫేక్ వీడియో అని రోజా అన్నారు.
సింగయ్య మృతి....
సింగయ్య మృతి చెందిన వెంటనే జిల్లా ఎస్పీ ప్రెస్‌మీట్‌లో కాన్వాయ్‌లో వేరే వాహనం గుద్దుకుని చనిపోయాడని చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ వాహనం అని ఎలా చెబుతారంటూ మాజీ మంత్రి రోజా నిలదీశారు. జగన్‌ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందన్న ఆర్కే రోజా అందుకే వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని అన్నారు.